Babu Mohan : యాంకర్ పై మండిపడిన బాబు మోహన్.. నీకు ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసంటూ?

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత, కమెడియన్ బాబు మోహన్ ( Babu Mohan )గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించి కమిడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న బాబు మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Babu Mohans Shocking Comments On Anchor Ramulamma Alias Teenmar Ramya-TeluguStop.com

మరి ముఖ్యంగా అప్పట్లో కోటా శ్రీనివాసరావు , బాబు మోహన్( Kota Srinivasa Rao ) కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

భారాసా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాబూ మోహన్.

ఆ తర్వాత బీజేపీ( BJP ) పార్టీలో చేరారు.ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ యాంకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో యాంకర్ ప్రశ్నిస్తూ.భారాసా పార్టీలో ఉన్నప్పుడు మా బావా మా బావా అంటూ కేసీఆర్( KCR ) ని పొగిడి,బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు తిడుతున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.నీకు ఎంత వరకు చెప్పాలో నాకు తెలుసు.ఏంటి నా ముందు తెడ్డు తిప్పుతున్నావ్ అంటూ సీరియస్ అయ్యారు బాబు మోహన్.

దాంతో డిష్కషన్ అంటే ఇలాగే ఉంటుంది.మనం మాట్లాడుకుంటేనే కదా ప్రజలకు మరిన్ని విషయాలు తెలిసేవి అంటూ యాంకర్ అనగా, మనం తర్వాత మాట్లాడుకుందాం.నేను ఫ్రీగా ఉన్నప్పుడు రా మా ఇంట్లో ఉండు.ఒక్క పూట కాదు రెండు రోజులు ఉండు అప్పుడు మాట్లాడుకుందాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బాబు మోహన్.

ప్రజలకు ఎంత వరకు తెలియాలో అంతవరకే తెలియాలి అంటూ ఫైర్ అయ్యారు.అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలో యాంకర్ తో పులిహోర గట్టిగానే కలిపారు బాబు మోహన్.నిన్ను చూసిన తర్వాత నాలో ఉత్సాహం పెరిగిందని, మీరు చెప్పే తీరు నచ్చుతుంది అంటూ బిస్కెట్లు వేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube