కూతురి స్పీచ్ కు కంటతడి పెట్టిన మీనా.. అమ్మ గురించి అలా రాయొద్దని చెప్పడంతో?

సీనియర్ నటి మీనా( Actress Meena )కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.ప్రస్తుతం మీనా తెలుగులో తక్కువ సినిమాలలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

 Nainika Emotional Speech Goes Viral In Social Media Details Here , Nainika Emoti-TeluguStop.com

బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా వయస్సు పెరుగుతున్నా సినిమా ఇండస్ట్రీలో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన మీనా 2009 సంవత్సరంలో విద్యాసాగర్( Vidyasagar ) అనే ప్రముఖ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్నారు.

మీనా, విద్యాసాగర్ దంపతులకు నైనిక( Nainika ) అనే పాప ఉన్నారు.అయితే మీనా రెండో పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.వైరల్ అయిన వార్తలు మీనాను ఎంతో బాధ పెట్టడంతో ఆమె స్పందించడంతో పాటు వైరల్ అయిన వార్తల గురించి ఒకింత ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు కాగా కొన్నిరోజుల క్రితం మీనాకు సన్మాన కార్యక్రమం జరిగింది.

సన్మాన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా ఆ వీడియోలో నైనిక మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.నైనిక మాట్లాడుతూ అమ్మా నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు.ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావని నైనిక చెప్పుకొచ్చారు.నాన్న చనిపోయాక అమ్మ డిప్రెషన్ కు గురైందని మానసికంగా దెబ్బ తిందని నైనిక తెలిపారు.

ఇకపై అమ్మను జాగ్రత్తగా చూసుకుంటానని నైనిక కామెంట్లు చేశారు.మా అమ్మ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారని మా అమ్మ కూడా మనిషేనని ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయని దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దని నైనిక చెప్పుకొచ్చారు.నైనిక కామెంట్లు విని మీనా కంటతడి పెట్టుకున్నారు.నైనిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube