సమ్మర్ హలీడేస్( Summer Holidays ) షురూ అయ్యాయి.కుటుంబ సభ్యులంతా కలిసి తమ సొంత ఊళ్లలో, లేదంటే ఎక్కడికైనా విహార యాత్ర( Excursion )లకో ఇపుడు ప్లాన్ చేసుకుంటుంటారు.
ఈ క్రమంలో కొంతమంది స్నేహితులతో, మరికొంతమంది కుటుంబ సభ్యులతో, ఇంకొంతమంది కాలనీ ఫ్రెండ్స్ ఇలా చాలా మంది కలిసి ప్రయాణించాలని టూర్‌లు ప్లాన్ చేసుకుంటారు.సుదూర ప్రాంతాలు, హిల్ స్టేషన్స్, మంచు ప్రదేశాలు( Remote areas, hill stations, snowy places ) ఇలా వారి అభిరుచులకు తగ్గినట్టుగా టూరిస్ట్ స్పాట్స్‌ని ఇక్కడ చాలామంది ఎంచుకుంటారు.
అయితే పెద్ద సంఖ్యలో జనం కలిసి వెళ్తున్నప్పుడు అందరూ కలిసి సరదాగా ఒకే బోగీలో పయనించాలని అనుకుంటారు.
అందుకోసం ట్రైన్‌లో( train ) ముందుగానే ఒక కోచ్ మొత్తాన్ని బుక్( Book the entire coach ) చేసుకోవలసి ఉంటుంది.
అయితే ఇలా ఒకే కోచ్ కావాలంటే కొన్ని నియమనిబంధనలు వుంటాయని చాలామందికి తెలియదు.ఎక్కువ మంది ప్రయాణికులు అలా ఒకే బోగీలో వెళ్లాలంటే అనుమతి కోసం సంబంధిత రిజర్వేషన్ కార్యాలయం కంట్రోలింగ్ ఆఫీసర్/చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
తద్వారా మీరు రైలులో కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు.బల్క్ అకామడేషన్‌ను కవర్ చేసే ఈ బుకింగ్‌లు ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌లో 10.00 గంటల తర్వాత అందుబాటులో ఉంటాయి.కోచ్‌లు లేదా రైళ్లను బుక్ చేసుకునే వారు ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా బుకింగ్ పద్ధతి, ప్రయాణ వివరాలు, ప్రయాణ మార్గం, ఇతర సమాచారాన్ని అందించాలి.

అయితే ఇపుడు పూర్తి రైలు, కోచ్ బుక్ చేసుకోవడం ఎలాగో చూస్తే, మొదటగా దానికి IRCTC అధికారిక FTR వెబ్‌సైట్ www.ftr.irctc.co.inని సందర్శించాల్సి ఉంటుంది.తరువాత లాగిన్ చేసి కింది ఆధారాలను సమర్పించాలి.
1.మొత్తం కోచ్‌ని బుక్ చేయాలంటే FTR సేవను ఎంచుకోవాలి.
2.తరువాత చెల్లింపు చేయడానికి మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి.
3.ఆ తర్వాత నచ్చిన చెల్లింపు మాధ్యమం ద్వారా డబ్బులు చెల్లించాలి.

4.ఇక్కడ కనీసం 6 నెలల ముందుగానే కోచ్‌ని బుక్ చేసుకోవాలి.
5.దానికి సెక్యూరిటీ డిపాజిట్ అనేది అవసరం.
6.ప్రయాణం పూర్తయిన తర్వాత ఇది వాపసు చేయబడుతుంది.
గమనిక: IRCTC మీకు క్యాటరింగ్ సేవను కూడా అందిస్తుంది.కాబట్టి అందులో మీకు కావలసిన సెలక్షన్స్ ఎంచుకోవచ్చు.







