ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.పుష్ప 1 తో నార్త్ సైడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు బన్నీ.
అందుకే పుష్ప 2కి అక్కడ భారీ బిజినెస్ జరిగుతుంది.ఇదిలాఉంటే కొన్నాళ్లుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాక్ వచ్చింది.
అట్లీ( Atlee ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సర్ ప్రైజ్ రోల్ లో జస్ట్ అలా కనిపిస్తారని అన్నారు.అయితే బన్నీ అండ్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం అల్లు అర్జున్ షారుఖ్( Shah Rukh ) సినిమాలో నటించాడట.ఆల్రెడీ సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.అయితే షారుఖ్ జవాన్ లో అల్లు అర్జున్ ఉన్నట్టుగా ముందు లీక్ చేయకూడదని మేకర్స్ ప్లాన్.కానీ అల్లు అర్జున్ ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడని టాక్ వచ్చేసింది.
మరి షారుఖ్ తో అల్లు అర్జున్ స్క్రీన్ షేరింగ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.పుష్ప 2ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అవుతుండగా ఇక మీదట తన సినిమాలన్నీ అదే రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.