ప్రస్తుతం డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.అయితే ఒక మహిళ మాత్రం లేడీ సెలబ్రిటీలకు( Lady Celebrities ) చీర కట్టడం ద్వారా కూడా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.
మన దేశ సాంప్రదాయంలో చీరకు ( Saree ) ప్రత్యేక స్థానం ఉంది.ఏ అమ్మాయి అయినా చీరలో కొత్తగా కనిపించడంతో పాటు మరింత అందంగా కనిపిస్తారని చాలామంది భావిస్తారు.
టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన లేడీ సెలబ్రిటీలు పలు ఈవెంట్లలో చీరలో మెరుస్తారనే సంగతి తెలిసిందే.అయితే చాలామంది సెలబ్రిటీల చీరకట్టు వెనుక డాలీ జైన్( Dolly Jain ) ఉన్నారు.
కేవలం 18 సెకన్లలో చీర కట్టే టాలెంట్ ఈమె సొంతం కాగా ఈమెకు ఏకంగా 325 రకాల డ్రెస్సింగ్ స్టైల్స్ తెలుసు.డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి ఊహించని స్థాయిలో అవగాహన కలిగి ఉండటం వల్లే ఈమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది.

చీర కట్టడానికి డాలీ జైన్ సెలబ్రిటీల నుంచి 35,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు.డాలీ జైన్ అత్తయ్య చీర మాత్రమే కట్టుకోవాలని సూచించడంతో తనకు తాను చీర కట్టుకోవడం మొదలెట్టిన డాలీ జైన్ చీరకట్టులో ప్రావీణ్యం సంపాదించి ఈ స్థాయికి ఎదిగారు.నయనతార, అలియా భట్, సోనమ్, దీపికా పదుకొనే, పలువురు సెలబ్రిటీల కోసం డాలీ జైన్ పని చేశారు.

ఎంతోమంది గృహిణులకు డాలీ జైన్ ఆదర్శంగా నిలిచారు.తాజాగా డాలీ జైన్ ఇండియన్ ఐడల్ 13 అనే రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు.తనకు ప్రతిభ ఉండటం వల్లే చీరకట్టు ద్వారా డాలీ జైన్ ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారు.
ఈమె సంపాదన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.డాలీ జైన్ భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడంతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.







