రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి గ్రామ శివారులో నిన్న రాత్రి పిడుగు పడి కోటయ్యా గారి రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కి చెందిన ఆవు, బర్రె మృతిచేందడం జరిగింది.ఇట్టి విషయాన్నీ తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు, గంభీరావుపేట మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ నిరుపేద రైతుకు 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రకృతి వైపళ్యం వల్ల (పిడుగు) పడి ఆవు,గేదె మృతి చెందిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి గడ్డమీది ప్రసాద్ రెడ్డి,మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్, బీజేపీ సీనియర్ నాయకులు సర్వోత్తం, మల్లేష్ యాదవ్, స్థానిక రైతులు రాజు,చెన్నారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.







