స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Director Mani Ratnam ) గురించి మన అందరికి తెలిసిందే.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అంతే కాకుండా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తెరకెక్కించారు మణిరత్నం.
ఇది ఇలా ఉంటే గత ఏడాది మనిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్1 ( Ponniin Selvan1 )సినిమా విడుదల అయ్యి మిశ్రమ స్పందనను రాబట్టింది.కాగా ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మణిరత్నం.ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయం ఉండగా తాజాగా డైరెక్టర్ మణిరత్నం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా తొలి భాగం తమిళ్ లో సూపర్ హిట్ సాధించింది.
కానీ మిగతా భాషల్లో మాత్రం ఆశించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయింది.దాన్ని దృష్టిలో ఉంచుకున్న మణిరత్నం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీఎస్ 2 సినిమాకు సంబంధించి ఇప్పటికే తమిళంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు మణిరత్నం.

కానీ మిగతా భాషల్లో ప్రమోషన్స్ ను మాత్రం ప్రారంభించలేదు.అసలు ప్రారంభించే ఆలోచన కూడా లేనట్లు తెలుస్తోంది.దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.
ఇక పీఎస్ 1 పాన్ ఇండియా లెవల్లో విడుదల అయినప్పటికీ ఒక్క తమిళంలోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.మిగతా భాషల్లో యావరేజ్ టాక్ తో లాభాలు సాధించలేకపోయింది.
దాంతో ఈసారి కేవలం ఒక్క తమిళంలోనే ప్రమోషన్స్ చేపట్టాలని మణిరత్నం భావిస్తున్నాడట.అందుకే తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేపట్టట్లేదు.
ఎందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అయితే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయినట్టేఅంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.







