100 డేస్ ఆఫ్ 'వీరసింహారెడ్డి'.. జై బాలయ్య అంటూ డైరెక్టర్ పోస్ట్!

టాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) అంటే తెలియని వారు ఉండరు.ఈయన యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు.

 Veera Simha Reddy Director Tweet On 100 Days Run, Veera Simha Reddy, Gopichand M-TeluguStop.com

ముందు నుండి యాక్షన్ ఎంటర్టైనర్స్ తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నారు.ఈ మధ్య వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

క్రాక్, వీరసింహారెడ్డి వంటి రెండు సక్సెస్ లతో టాలీవుడ్ లో స్టార్ హీరో అయిపోయాడు.

నటసింహం నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) తో ”వీరసింహారెడ్డి” ( Veera Simha Reddy ) సినిమాను తీసాడు.

క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ఈయన వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించాడు.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించింది.అలాగే దునియా విజయ్( Duniya Vijay ) విలన్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi Sarath Kumar )కీలక రోల్ లో నటించింది.

మరి బాలయ్య కెరీర్ లోనే రికార్డ్ ఓపెనింగ్స్ అందుకుని అతి పెద్ద హిట్ గా నిలిచితిన్ ఈ సినిమా లేటెస్ట్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది.

మరి ఈ సినిమా మాసివ్ రన్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ గోపీచంద్ ( Gopichand Malineni ) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.”నా దేవుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో సినిమా చేసి హిట్ కొట్టడం మర్చిపోలేని అవకాశం అని.జై బాలయ్య అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube