టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రభాస్ నటించిన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ , సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే ( Adipurush, Salar, Spirit, Project K )లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండగా ఇందులో ఇప్పటికే సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే ఆదిపురుష్ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా టీజర్ విమర్శల పాలవ్వడంతో దాదాపు చాలా సమయం తీసుకున్న మూవీ మేకర్స్ ఇటీవలె మరోసారి ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకోగా సినిమా టీజర్ విడుదల ఈ విమర్శల పాలవడంతో తీవ్ర నిరాశ చెందారు.అంతేకాకుండా ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా విడుదల అయ్యేలా కూడా కనిపించడం లేదు.ఆదిపురుష్ సినిమా విడుదల కోసం అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.తీరా టీజర్ విడుదలైన తర్వాత బొమ్మల సినిమా అంటూ ఆ సహనం వ్యక్తం చేశారు.
దాంతో మూవీ సినిమాను 3డి కి షిఫ్ట్ చేసినట్టు తెలిపారు.త్రీడీలో సినిమాను చూసినవారు విజువల్స్ బాగానే ఉన్నాయంటూ మెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా విఎఫ్ఎక్స్ మార్చి కొత్త టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

అయితే అప్పటితో పోలిస్తే ఈ టీజర్ బాగానే కనిపిస్తుంది.కానీ ఆ హైప్ మాత్రం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.విజువల్ వండర్ గా ఆదిపురుష్ సినిమాను తెరక్కిస్తున్నారు అని చెప్పడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
కానీ టీజర్ చూసిన తర్వాత ఆ అంచనాలు మొత్తం తలకిందులు అయ్యాయి. ఆ టీజర్ చూసిన ప్రేక్షకులు ఏం మార్చావు రా బాబు అంటూ మళ్ళీ దారుణంగా ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు మరోసారి అంచనాలు పెట్టుకుని మళ్ళీ నిరాశ పడలేము అని అంటున్నారు డార్లింగ్ ఫాన్స్.ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో హీరో ప్రభాస్ సరసన కృతీ సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.







