సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది.ఎంతో మంది సినీ తారలు క్రికెటర్లను ప్రేమించే పెళ్లి చేసుకోవడం మనం చూస్తున్నాము.
ఇక క్రికెట్( Cricket ) రంగంలో అద్భుతమైన ఆట తీరని కనబడుతూ స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు సంపాదించుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్( Dhoni, Sachin, Kapil Dev Mithali Raj ) వంటి క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు( Biopic Movies ) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) తనకు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక రామ్ చరణ్ మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోల సైతం విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ కామెంట్లు చేశారు అయితే తాజాగా విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విరాట్ కోహ్లీ తాజాగా రాబిన్ ఊతప్పతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రం గురించి చర్చలు వచ్చాయి.మీ బయోపిక్ చిత్రంలో ఏ హీరో నటిస్తే బాగుంటుందని ఊతప్ప అడగగా అందుకు కోహ్లీ షాకింగ్ సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా కోహ్లీ సమాధానం చెబుతూ తన బయోపిక్ చిత్రంలో తానే నటిస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈయన బయోపిక్ చిత్రంలో పలువురు హీరోలు నటిస్తామంటూ కామెంట్ చేయగా ఈయన మాత్రం వాళ్ళెవరు వద్దు తానే నటిస్తాననేలా కామెంట్ చేశారని అర్థమవుతుంది అయితే కోహ్లీ జీవితంలో కూడా ఎన్నో కీలక మలుపులు, ట్విస్టులు, కష్టాలు, ప్రేమ బ్రేకప్స్ పెళ్లి వంటి సంఘటనలు ఉన్నాయి.అలాగే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోహ్లీ బయోపిక్ చిత్రం చేస్తే తప్పనిసరిగా హిట్ అవుతుంది.అయితే కోహ్లీ తన బయోపిక్ చిత్రంలో తానే నటిస్తానని చెప్పడంతో ఈయన నిజంగానే తన భార్య అనుష్క శర్మ (Anushaka Sharma ) సహకారంతో ఈ బయోపిక్ చిత్రంలో నటిస్తారా? లేక సరదాగా అన్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.