ప్రతి ఒక్కరి జీవితంలో కాలమన్నది చాలా మార్పులు తీసుకొస్తుంది.ఇప్పటి మన ఆలోచన విదానం మన నమ్మకాలు ఒక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మనకే సిల్లీగా అనిపించవచ్చు ఒకప్పుడు మనకు బద్ధ శత్రువులుగా కనిపించిన వారు మిత్రులు అయిపోవచ్చు లేదా పూర్తి అపరిచితులు గా కూడా మారిపోవచ్చు .
ఎందుకంటే కాలం తీసుకొచ్చే మార్పులు అలాంటివి.కాలాన్ని మించిన వైద్యుడు లేడు.
గుణపాటాలు నేర్పుతూ మనిషి పరిమితి చెందడానికి కాలం సహాయం పడుతుంది.ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ప్రవర్తించిన ఆ ఇద్దరి మధ్యన ఇప్పుడు కనిపిస్తున్న కొత్త అభిమానం చాలా ఆసక్తికరంగా పరిణామంగా మారింది.

వైఎస్ఆర్ పార్టీలో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పేరు చెప్తే ఒంటికాలితో లేచి విమర్శలు చేసే వారిలో విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ఒకరు.వృత్తి గత నైపుణ్యాలతో పాటు అద్భుతమైన భాషా పటిమ కూడా ఉన్న విజయసాయి రెడ్డి గారు చంద్రబాబును విమర్శించేటప్పుడు మాత్రం ఒక మామూలు పార్టీ కార్యకర్తలారా అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఎంపీగా తన హోదాను కూడా మరిచిపోయి విమర్శించేవారు .ఆయన ఉపయోగించే భాష పై విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటిని లెక్క చేసేవారు కాదు .చంద్రబాబు పట్ల నర నరాల్లో.కోపం ,ప్రతీకారం ఉన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉండేది.

అయితే గత కొన్ని నెలలుగా ఆయన పూర్తిస్థాయి నిశ్శబ్ద వ్రతం పట్టారు .ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) లో అనేక కీలక రాజకీయ పరిణామాలు జరిగినప్పటికీ ఆయన మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు .ప్రతిపక్షాలను విమర్శించడానికి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆయన తన ఉనికిని ప్రదర్శించలేదు ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో ఆయన శుభాకాంక్షలు చెప్పిన వైనం చాలామందికి ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కూడా కలగజేసింది గత సంవత్సరం ఇదే రోజు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు చెబుతూ ఎంత వ్యంగంగా మాట్లాడారో తెలిసిన వారికి ఇప్పుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అంటూ గౌరవిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చెప్పిన విధానం చూస్తే ఇంతలోనే ఎంత మార్పు అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి.పార్టీలో తనకు తగ్గిన ప్రాధాన్యత కారణాలో లేక మారిన సమీకరాణాల వల్లో మొత్తానికి తనలోని ఒక కొత్త యాంగిల్ ను విజయసాయిరెడ్డి పరిచయం చేస్తున్నారని చెప్పాలి
.






