వేములవాడ: మినీ స్టేడియం పనులను ఆగస్ట్ కల్లా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యం తో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.గురువారం వేములవాడ పట్టణంలో రూ.5 కోట్లతో అయ్యప్ప దేవాలయం సమీపంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.పనులను వేగంగా చేపట్టేందుకు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ లను ఆదేశించారు.
ఇప్పటికే మినీ స్టేడియంలో ఉన్న నిర్మాణాలను పరిశీలించారు .క్రికెట్ గ్రౌండ్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్ బాల్ లాంటి క్రీడా కోర్టు లను సిద్ధం చేయాలన్నారు.డార్మేటరి ల నిర్మాణం చేపట్టాలన్నారు.ఇండోర్ స్పోర్ట్స్ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.స్టేడియం లోపల సింథటిక్ ట్రాక్ ను సిద్ధం చేయాలన్నారు .క్రీడాకారుల కు , కోచ్ లకు రక్షిత త్రాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను సిద్ధం చేయాలన్నారు.
రాత్రిపూట కూడా అడుకునెలా లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.సమీపంలో నీ ప్రధాన రహదారి నీ కలిపేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు.క్రీడా నేపథ్యంగా ప్రవేశ మార్గం ఆర్చ్ ను ఆకర్షణీయంగా నిర్మించాలని చెప్పారు.నిర్మాణ అగ్రిమెంట్ ను త్వరగా పూర్తి చేసుకొని ఇండోర్, ఔట్ డోర్ పనులను వేరు వేరు గా ఏకకాలంలో చేపట్టి నాణ్యత తో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.







