సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు పెళ్లంటేనే వెనుకడుగు వేస్తున్నారు.ఎందుకో తెలియదు కానీ పెళ్లి ( Marriage ) గురించి ప్రశ్న ఎదురైతే చాలు భయపడుతున్నారు.
ఇప్పటికే చాలామంది హీరోలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.నిజానికి చెప్పాలంటే సింగిల్ లైఫ్ బెటర్ అని అంటున్నారు కొందరు హీరోలు.
ఇప్పుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా అదే మాట చెబుతున్నాడు.
మెగా వారి మేనల్లుడు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అందరికీ బాగా పరిచయమున నటుడు.
పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందింది.
ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన సాయి కు కొన్ని సినిమాలలో అంతగా హిట్టు లేకపోయినా.ఆ తర్వాత కు వచ్చిన ప్రతి రోజు పండగే, విన్నర్, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమాల తర్వాత రిపబ్లిక్ సినిమాలో( Republic Movie ) కూడా నటించాడు.అయితే ఈ సినిమా సమయంలో సాయిధరమ్ తేజ్ కు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి దగ్గర బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.సమయంలో కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చికిత్స పొంది ఆ తర్వాత మామూలు మనిషిగా తిరిగి వచ్చాడు.ఇక కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ వరుస ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్నాడు.
ప్రస్తుతం ఆయన నటించిన విరూపాక్ష మూవీ( Virupaksha Movie ) త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.అయితే తాజాగా మై విలేజ్ షో గంగవ్వతో ప్రమోషన్స్ భాగంలో కాసేపు ముచ్చట్లు పెట్టాడు.ఈ నేపథ్యంలో గంగవ్వ( Gangavva ) అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు.
అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అందులో గంగవ్వ సాయి ధరంతేజ్ ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనడంతో.వెంటనే ఆయన.తను చాలా మంది అమ్మాయిలను లవ్ చేశాను అని.కానీ ఎవరికి చెప్పలేదు అని అన్నాడు.ఇక వాళ్లకు పెళ్లిళ్లు కూడా అయ్యాయని అన్నాడు.
దీంతో గంగవ్వ అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు అని అడగటంతో.ఒక తమ్ముడు ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు.
దాంతో గంగవ్వ తమ్ముడు కోసమైనా పెళ్లి చేసుకోవాలి అని.తమ్ముడికి కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా అని అనటంతో.తాను మాత్రం పెళ్లి చేసుకోను అని.ఈ సోలో లైఫ్ ఏ బాగుంది అంటూ.తమ్ముడు చేసుకున్న పరవాలేదు కానీ నేను చేసుకోను అన్నట్లు మాట్లాడాడు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.