టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్( Saitej ) విరూపాక్ష ప్రమోషన్స్( Virupaksha Promotions ) లో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.తన లవ్ స్టోరీల గురించి సాయితేజ్ వెల్లడించడంతో పాటు ప్రేమలో ఏ విధంగా ఫెయిల్ అయ్యాడో కూడా చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారని సాయితేజ్ అన్నారు.నా జీవితంలో కూడా ఒకరు ఉన్నారని మనిషిగా, నటిగా నన్ను సమంత( Samantha ) అట్రాక్ట్ చేసిందని ఆయన తెలిపారు.
సయామి, రెజీనా( Sayami, Regina ) అంటే కూడా నాకు చాలా ఇష్టమని సాయితేజ్ పేర్కొన్నారు.వాళ్లు నా ఫస్ట్ హీరోయిన్స్ కావడంతో వాళ్లు అంటే నాకు ఇష్టమని సాయితేజ్ చెప్పుకొచ్చారు.
ఇంటర్ లో ఉన్న సమయంలో బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని లవ్ చేశానని సాయితేజ్ అన్నారు.మొదట మేమిద్దరం ప్రాణ స్నేహితులలా ఉండేవాళ్లమని ఆ తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

డిగ్రీలో నేనే ఆమెకు పెళ్లి చేశానని సాయితేజ్ అన్నారు.ఆ సమయానికి నాతో డిగ్రీ పట్టా తప్ప ఇంకేం లేదని అందువల్లే తాను ఈ విధంగా చేశానని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.నా ప్రేమను త్యాగం చేశానని సాయితేజ్ అన్నారు.సినిమాల్లోకి వచ్చిన తర్వాత తిక్క హీరోయిన్ లారిస్సా బోనేసితో లవ్ లో పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒప్పుకుంటే డేటింగ్ చేద్దామని లారిస్సాను అడిగానని సాయితేజ్ అన్నారు.

నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.సారీ తేజ్ అని ఆమె చెప్పడంతో నా హృదయం బద్ధలైందని సాయితేజ్ చెప్పుకొచ్చారు.పెళ్లి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుందని ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అని జీవనం సాగిస్తున్నానని సాయితేజ్ అన్నారు.
సాయితేజ్ చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.







