విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు గడువు ముగిసింది.ఎన్ని కంపెనీలు బిడ్లు వేశాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
అదేవిధంగా సింగరేణి సంస్థ బిడ్ పై కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి పదార్థాలతో పాటు మూలధనం సమకూర్చుతామని ఈనెల 15వ తేదీ నాటికే 22 కంపెనీలు బిడ్లు వేసిన సంగతి తెలిసిందే.
ఇందులో ఆరు విదేశీ కంపెనీలుండగా పదహారు దేశీయ సంస్థలు ఉన్నాయి.తొలుత ఈఓఐకు గడువు ముగియగా కొన్ని సంస్థల వినతితో మరో ఐదు రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇవాళ్టి వరకు సమయం ఇచ్చింది.







