బాబు కి విజయసాయి విషెస్ ! పెరిగిపోతున్న అనుమానాలు ?

‘ టీడీపీ అధ్యక్షులు , ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆరోగ్యం , దీర్ఘాయుష్షు తో మరెన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా  ”  అంటూ వైసీపీ కీలక నేత,  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 Vijayasai Reddy Birthday Wishes To The Chandrababu Naidu , Vijayasai Reddy,-TeluguStop.com

ఎప్పుడూ చంద్రబాబు, లోకేష్( Vijayasai Reddy ) , టిడిపి పై విమర్శలతో విరుచుకుపడే విజయసాయి స్వరంలో ఒక్కసారిగా మార్పు కనిపించడం సంచలనంగా మారింది.చాలా కాలంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు విజయసాయి కి మధ్య దూరం పెరిగినట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

గతంలో ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడం లేదు.

Telugu Ap, Chandrababu, Lokesh, Vijayasaireddy, Ysrcp-Politics

 ఈ నేపథ్యంలోనే విజయసాయి ట్వీట్ వైరల్ గా మారింది.ఇటీవల టిడిపి నేత,  నందమూరి వారసులు తారకరత్న గుండెపోటుతో మరణించారు.ఆ సమయంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు సన్నిహితంగా మెలగడం , ఆసుపత్రి నుంచి అంత్యక్రియల వరకు చోటు చేసుకున్న వ్యవహారాల్లో ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం,  అనేక సార్లు భేటీ కావడం వంటి వ్యవహారాలతో కాస్తో, కూస్తో సాన్నిహిత్యం పెరిగింది.

అప్పటి నుంచి విజయసాయి వైఖరిలో మార్పు వచ్చినట్టుగానే కనిపిస్తోంది .

Telugu Ap, Chandrababu, Lokesh, Vijayasaireddy, Ysrcp-Politics

సోషల్ మీడియాలోనూ చంద్రబాబు , టీడీపీకి వ్యతిరేకంగా పెద్దగా విజయసాయిరెడ్డి స్పందించడం లేదు.  వైసీపీ లోనూ ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.గతంలో వైసీపీలో అన్నీ తానై వ్యవహరించిన విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు ఆ స్థాయిలో యాక్టివ్ గా లేకపోవడం, చంద్రబాబుకు ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వంటివి  చర్చనీయాంశం గా మారాయి.

Telugu Ap, Chandrababu, Lokesh, Vijayasaireddy, Ysrcp-Politics

ముఖ్యంగా మారిన విజయసాయిరెడ్డి వ్యవహార శైలి పై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.దీనికి తగ్గట్టుగానే జగన్ సైతం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కి( Sajjala Ramakrishna Reddy ) ఇస్తున్నంత స్థాయిలో విజయసాయి కి ప్రాధాన్యం ఇవ్వకపోవడం , ఇప్పుడు విజయసాయి చంద్రబాబు విషయంలో సానుకూలంగా మారడం వంటివి అన్నీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube