'దసరా' ఓటిటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పట్నుండి అంటే?

న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘దసరా'( Dasara ).శ్రీరామనవమి కానుకగా మార్చి 30న గ్రాండ్ గా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

 Nani's Dasara Movie Ott Release Date Fixed, Dasara, Dasara Ott, Nani, Keerthy Su-TeluguStop.com

ముందు నుండి ట్రేడ్ పండితులు చెబుతూన్నట్టుగానే నాని నటించిన ఈ మూవీ 100 కోట్లను వసూళ్లను క్రాస్ చేసి ఏకంగా 110 కోట్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

టైర్ 2 హీరోల్లో ఒకరైన నాని ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.సుకుమార్ శిష్యుడు తెరకెక్కించిన ఈ సినిమాతో నాని మరో మెట్టు ఎక్కాడు.వరుసగా ప్లాప్స్ అందుకుని నాని రేసులో వెనుకబడ్డాడు అనుకుంటే ఇప్పుడు దసరా వంటి డిఫరెంట్ సినిమాతో వచ్చి ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసాడు.

శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.ఇప్పటికి కొన్ని చోట్ల థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తున్న ఈ సినిమాపై ఒక అప్డేట్ వచ్చింది.ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ (Dasara OTT) అయినట్టు తెలుస్తుంది.

ఇటీవలే ఈ సినిమా ఓటిటి పై ఇంట్రెస్టింగ్ న్యూస్ రాగా మేలో రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటిటి కు సంబంధించిన అధికారిక డేట్ వచ్చేసింది.ఏప్రిల్ 27 నుండే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ( Netflix ) స్ట్రీమింగ్ కు రానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

దీంతో నాని దసరా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.చూడాలి ఓటిటిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube