మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సుప్రీం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) తాజాగా విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన రోడ్డు ప్రమాదం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
రెండు సంవత్సరాల క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి ( Sai Dharam Tej for road accident )గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.దాదాపు నెల రోజులకు పైగా ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ప్రాణాలతో తిరిగి బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే ఆ ప్రమాదం గురించి సాయిధరమ్ తేజ్ ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో పలు విషయాలను తెలియజేశారు అయితే ప్రమాదం జరిగిన తర్వాత చిరంజీవి ( Chiranjeevi ) మావయ్య తనకు ఒక సందేశం పంపించారని,ఆ సందేశం చదివిన తర్వాత తనలో కసి పట్టుదల పెరిగింది అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.
మరి సాయిధరమ్ తేజ్ కి చిరు పంపిన ఆ సందేశం ఏంటి.ఆయన చెప్పిన మాటలు ఏంటి అనే విషయానికి వస్తే…ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే సిరివెన్నెల రాసిన లైన్‌ని తనకు పంపించారట.ఇలా మావయ్య పంపిన ఈ సందేశం తనని చాలా ఇన్స్పైర్ చేసిందని, తిరిగి తనని మామూలు మనిషి అవ్వడానికి ఎంతో దోహద పడిందని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఎన్నో అంజనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విరూపాక్ష సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.