ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అందులో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి చాలా సినిమాలు ప్లాప్ అవుతుంటాయి.ఈ సంవత్సరంలో సినిమాలు తీసి డిజాస్టర్ అయినా హీరో లు ఎవరో ఒకరి తెలుసుకుందాం.
చాలా మంది స్టార్ హీరోలు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.బాలకృష్ణ( Balakrishna ) మరియు అల్లు అర్జున్ ( Allu Arjun )నటించిన సినిమా లు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాలేదు.

కానీ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )నటించిన ఆచార్య ( Acharya )మరియు గాడ్ ఫాదర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా మరో సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అత్యంత దారుణమైన పరాజయం గా నిలిచింది.

ఈ ఏడాది లో అట్టర్ ప్లాప్ సినిమా గా ఆ సినిమా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.అలాగే గోపిచంద్ ( Gopichand )హీరో గా వచ్చిన పక్క కమర్షియల్ సినిమా కూడా ప్లాప్ అయింది.ఈ ఏడాది లో మరో దురదృష్టమందుడు ఎవరు అంటే విజయ్ దేవరకొండ.
ఈయన నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది.అందుకే ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయాలనుకున్న సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.
అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. నితిన్ ( Nitin )నటించిన సినిమా మాచర్ల నియోజక వర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది, మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన సర్కార్ వారి పాట పర్వాలేదు అనిపించుకుంది.ఇంకా ఈ ఏడాది నాగ చైతన్య కూడా తన థాంక్యూ సినిమా తో నిరాశ పరిచాడు.
రామ్ తన ది వారియర్ సినిమా తో నిరాశ పర్చాడు.

ఆది సాయి కుమార్ అయితే దాదాపు 4 సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది.మొత్తంగా ఈ ఏడాది తెలుగు హీరోలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.ఈ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే సంవత్సరం రాబోయే సినిమాల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.








