సమంత ( Samantha ) ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం( Shaakuntalam ) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ ని రాబట్టడంలో విఫలం అయింది.
దాంతో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్ట పోయాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాతిక కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 10 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది.
అంటే 15 కోట్ల రూపాయల నష్టం బయ్యర్స్ కి తప్పదు అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా కి సమర్పకుడిగా దిల్ రాజు వ్యవహరించిన విషయం తెలిసిందే.ఆయన కూడా పలు ఏరియాల్లో పంపిణీ చేయడం జరిగింది.కనుక దిల్ రాజు నష్టాలను చవిచూసి ఉంటాడు అని కొందరు భావిస్తున్నారు.కానీ దిల్ రాజు చాలా తెలివిగా నిర్మాత గుణశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకుని లాభాల్లో వాటాను మాత్రమే తీసుకునేలా ప్లాన్ చేశాడట.
బడ్జెట్ పెట్టకుండా లాభాలు తీసుకుని బయటపడాలని భావించాడు.కానీ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాక పోవడంతో ఇప్పుడు దిల్ రాజుకు( Dil raju ) పెద్దగా దక్కిందేమీ లేదు.అలాగే ఆయనకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు.
మహా అయితే పేరు కాస్త పోయింది అంతే తప్పితే ఆయనకు ఆర్థికంగా ఏమాత్రం నష్టం రాలేదు అనేది కొంత మంది వాదన.లేదు ఈ సినిమా కోసం దిల్ రాజు దాదాపుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేశాడు.
అంతే కాకుండా కొన్ని ఏరియాల్లో సినిమా ను పంపిణీ చేశాడు.
కనుక రెండు విధాలుగా దిల్ రాజు నష్టపోయి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి తెలియాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.ఈ సినిమా ఫ్లాప్ అవడం పట్ల సమంతకాస్త విడ్డూరంగా స్పందించింది.
తనకి ఇష్టం లేకుండానే సినిమా ను చేసినట్లుగా సోషల్ మీడియా లో కామెంట్ చేసింది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.