ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రోఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.మావోయిస్టులతో సాయిబాబాకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నమోదైన కేసులో నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
కేసుపై తాజాగా మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిర్దారించిన క్రింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.
బాంబే హైకోర్టు నిర్దోషిగా తీర్పును ఇచ్చింది.ఈ క్రమంలో హైకోర్టు తీర్పును ఎన్ఐఏ సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టివేయడమే కాకుండా నాలుగు నెలల్లో కేసును మళ్లీ విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.







