ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల జాబితాలో తెలంగాణలోని హైదరాబాద్ మహా నగరానికి చోటు దక్కింది.అభివృద్ధి పథంలో హైదరాబాద్ దూసుకు వెళ్తుంది.
వెల్త్ ట్రాకర్ కంపెనీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది.ఈ లిస్టులో మన హైదరాబాద్ 65వ స్థానంలో నిలవడం విశేషం.నగరంలో మొత్తం 11 వేల 100 మంది మిలియనీర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్ లో అత్యధిక నికర సంపద గల వ్యక్తుల సంఖ్య 78 శాతానికి పెరిగింది.కాగా ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది.







