ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉండనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ నుంచి విశాఖ పరిపాలనా రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు.రాష్ట్రంలో అతి పెద్ద నగరమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖని పేర్కొన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేయనున్నట్లు వెల్లడించారు.ప్రాంతాలు అన్నింటినీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
ఒకే అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారన్న ఆయన అంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు.







