సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా మారుమోగుతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా.( Parineeti Chopra ) ఈమె నాయకుడు ఎంపీ రాఘవ చద్దాతో( Raghava Chadha ) గత కొంతకాలంగా డేటింగ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఇదే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో మునిగితేలుతున్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించలేదు పరిణీతి చోప్రా.
మొన్నటికీ మొన్న రాఘవ చద్దా పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ కూడా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె డేటింగ్ రూమర్స్ ( Dating Rumors )పై క్లారిటీ ఇచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లుగా ఆ వార్తలే నిజం అయితే ఇటువంటి అపార్థులకు తావు లేకుండా స్పష్టత ఇస్తాను అని తెలిపింది పరిణీతి చోప్రా.ఒకవేళ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేకపోతే తాను కూడా స్పందించను అని తెలిపింది పరిణీతి.
గుర్తింపు ప్రేమ ఆమోదం వీటిని విజయంగా భావిస్తాం.
ఒకవేళ నేను ఎవరో ఎవరికి తెలియకపోతే నా విషయాలపై మీడియా ఆసక్తి లేకపోతే ఒక నటిగా నేను సాధించాలనుకున్నది సాధించలేదని అర్థం.ఎందుకంటే సక్సెస్ఫుల్ నటుడు ఎప్పుడు ఫేమసే.ప్రతి ఇంట్లోనూ మన గురించి చర్చ వార్తాపత్రికలు న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియా పాపరాజి కల్చర్ అంతటా మనమే ఉంటాము అంటూ వ్యంగంగా స్పందించింది.
నా జీవితాన్ని చర్చకు పెట్టే విషయంలో ముందు సన్నని గీత అనేది వాళ్ళు గుర్తించాలి.దాన్ని దాటి మరీ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే కొన్ని సందర్భాలలో అది నిజంగా అమర్యాదకరమే అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది పరిణీతి చోప్రా.