Siddharth : రెచ్చిపోయిన హీరో సిద్ధార్థ్.. ఆ హీరోయిన్ తో ఘాటు రొమాన్స్?

టాలీవుడ్ సినీపేక్షకులకు హీరో సిద్ధార్థ్ ( Siddharth )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, బొమ్మరిల్లు, ఆట, బావ,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సిద్ధార్థ్.

 Hero Siddharth Romance With Divyansha Kaushik Takkar Teaser-TeluguStop.com

తర్వాత నెమ్మదిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే.కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.

Telugu Siddharth, Indian, Sharwanand, Takkar Teaser, Tollywood-Movie

ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ చివరగా శర్వానంద్ ( Sharwanand )తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించాడు.ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టక్కర్.( takkar ) హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.

అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఈ సినిమా విడుదల కాదని చాలామంది భావించినప్పటికీ తాజాగా హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఇందులో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్( Divyansha Kaushik ) నటించిన విషయం తెలిసిందే.

Telugu Siddharth, Indian, Sharwanand, Takkar Teaser, Tollywood-Movie

ఈ సినిమాలో హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ ను చేశాడు సిద్ధార్థ్.సినిమా టీజర్ ని బట్టి చూస్తే ఇందులో సరికొత్త సిద్ధార్థ్ ని చూస్తామని చెప్పవచ్చు.ఇందులో హీరో హీరోయిన్ రొమాన్స్ మామూలుగా లేదు.

ఘాటు ఘాటు ముద్దులు హగ్గు లతో హాట్ సీన్లలో అదిరిపోయే రేంజ్ లో జీవించేశారు.ప్రస్తుతం ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను మే 26వ తేదీన విడుదల చేయనున్నారు.కాగా హీరో సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా( Indian 2 movie )లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో సిద్ధార్థ్.మరి ఈసారైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు లేదో చూడాలి మరి.ఈ టక్కర్ సినిమా హీరో సిద్ధార్థ్ కి ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube