వేసవికాలంలో ఉష్ణోగ్రత వల్ల వేడికి జనాలు అస్సలు బయటికి తిరగలేకపోతున్నారు.ఈ మండుతున్న ఎండల నుంచి ఉపశనం పొందేందుకు చాలామంది ఫ్రిజ్లోని చల్లని నీళ్లను అలాగే శీతలపానీయాలను తాగడానికి ఇష్టపడుతున్నారు.
అయినప్పటికీ కూడా ఈ వేడి నుండి ఉపశమనం పొందడం అంటే చాలా కష్టమని చెప్పాలి.అంతేకాకుండా వేసవికాలంలో డిహైడ్రేషన్, వడదెబ్బ( Dehydration ) లాంటి ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి.
అందుకే వీలైనంతవరకు ఇంటి లోపలే ఉండడం చాలా మంచిది.

అయితే కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.ఇక వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు వేసవికాలంలో చాలా ముఖ్యం.
పెరుగుతో చేసిన ఎలాంటి ఆహార పదార్థాలు అయినా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.ఇక ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో ఒక గ్లాసు మజ్జిగ తాగితే( Buttermilk ) ఉపశమనం కలుగుతుంది.
అలాగే కడుపులో ఉత్పత్తి అయ్యే వేడి, ఎసిడిటీని ఇది దూరంగా ఉంచుతుంది.

అలాగే సత్తు( Sattu )ను పేదవారి ప్రోటీన్ అని పిలుస్తారు.సత్తు అనేది పౌడర్ బెంగాల్ గ్రామ్ లేదా ఇతర పప్పులు, తృణధాన్యాల నుండి తయారు చేసే ప్రోటీన్ రిచ్ పౌడర్ అని చెప్పవచ్చు.ఇప్పుడు మార్కెట్లలో కూడా ఇవి సులభంగా లభిస్తుంది.
సత్తు వేసవి కాలంలో ఒక బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు.ఇది హీట్ స్ట్రోక్ నుండి రక్షిస్తుంది.
అందుకే ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాలు సత్తు కలిపి ఉదయాన్నే తాగాలి.ఇలా తాగితే రోజంతా హీట్ నుంచి బయటపడవచ్చు.

అలాగే తక్షణ శక్తిని కూడా ఇది అందిస్తుంది.ఇక వేసవికాలంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు కచ్చితంగా తీసుకోవాలి.కీరదోసకాయ( Cucumber ) 90% నీటితో నిండి ఉంటుంది.అందుకే కీరదోసకాయ ను వేసవికాలంలో తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.ఇక వేసవిలో హైడ్రేట్ గా ఉండేందుకు నిమ్మరసం కూడా చాలా అవసరం.ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
ఇది మనల్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది.