పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ప్రభాస్ ను రాముడి పాత్రలో ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూసారు.కానీ వీరి ఎదురు చూపులకు ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమా నుండి ఎప్పుడో టీజర్ రిలీజ్ అయ్యింది.మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ టీజర్ కు ఆడియెన్స్, ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది.ఈ టీజర్ లో వీఎఫ్ఎక్స్, సిజిఐ లకు అంత మంది రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.అందుకే మేకర్స్ జనవరిలో సంక్రాంతి కానుకగా రావాల్సిన సినిమాను వాయిదా వేసి మరీ జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మరి ఈ సమయాన్ని మేకర్స్ ఉపయోగించుకుని ఫ్యాన్స్ కోసం మరింత ఎఫర్ట్స్ పెట్టి మీకు విజువల్ ట్రీట్ ఇస్తామని తెలిపారు.చెప్పినట్టుగానే మేకర్స్ తాజాగా అప్డేట్ లతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసారు.జనవరిలో వాయిదా పడినప్పటి నుండి మేకర్స్ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ ను మరింత బెటర్ గా చేస్తున్నట్టు టాక్.ఇప్పటికి కూడా ఇదే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ వీఎఫ్ఎక్స్ గ్రేడ్ (Adipurush VFX) ను మరింత పెంచేసి టీజర్ లో చూపించిన దానికంటే మెరుగైన వీఎఫ్ఎక్స్ ఈసారి పక్కాగా ఉంటుందని తెలుస్తుంది.జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫైనల్ కట్ లో సిజీఐ (CGI) ఉంటుందని అర్ధం అవుతుంది.చూడాలి ఈసారైనా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారో లేదో.ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.







