పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం లో రానా కు జోడి గా చిన్న పాత్ర లో నటించిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్( Samyukta menon ) మొదటి సినిమా తోనే సక్సెస్ ని తన ఖాతా లో వేసుకుంది.ఆ సినిమా లో చిన్న పాత్ర చేసినప్పటికీ భీమ్లా నాయక్ నటి అంటూ పేరు పెంచుకొని మంచి ఆఫర్లను దక్కించుకుంది.
ఆకట్టుకునే రూపం తో పాటు చలాకితనం యాక్టింగ్ లో కూడా మంచి ప్రతిభ ఉంది.అందుకే తెలుగు లో ఈమె కు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
భీమ్లా నాయక్ చిత్రం తో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత బింబిసారా మరియు సార్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది.మొదటి మూడు సినిమాలు కూడా మంచి విజయాలను నమోదు చేయడంతో లక్కీ బ్యూటీ అనే పేరు సొంతం చేసుకుంది.
ఈ వారం ఈ ముద్దుగుమ్మ సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) తో కలిసి విరూపాక్ష చిత్తం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సంయుక్త మీనన్ తెలుగు లో మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇంత త్వరగా తెలుగు నేర్చుకోవడం నిజంగా గొప్ప విషయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో వరుసగా విజయాలు నమోదు అవుతున్నాయి.
సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ కి మరింతగా చేరువ అయ్యేందుకు గాను తెలుగు నేర్చుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.ఇతర భాషల్లో సినిమాల కంటే ప్రస్తుతం ఆమె దృష్టి తెలుగు సినిమా పరిశ్రమ పైన ఎక్కువగా ఉందని తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

విరూపాక్ష సినిమా ( Virupaksha )ప్రమోషనల్ కార్యక్రమాలలో కూడా ముద్దుగుమ్మ సంయుక్త మాట్లాడుతూ తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయబోతున్నట్లు పేర్కొంది.తెలుగు నేర్చుకుంటూ తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటుంది.ముందు ముందు సంయుక్త మీనన్ మంచి తెలుగు హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.







