ప్రొడ్యూసర్ రామానాయుడు( Producer Ramanaidu ) కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్( Venkatesh ) వరుస సినిమాలు చేసుకుంటూ చాలా తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ హీరో గా మంచి పేరు సంపాదించుకున్నాడు.బొబ్బిలి రాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మాస్ హీరో గా గుర్తింపు పొందాడు… ఇప్పటి వరకు వెంకటేష్ అన్ని జానర్స్ లో సినిమాలు చేసి హిట్ కొట్టాడు ముఖ్యంగా వెంకటేష్ అంటే ఫామిలీ ఆడియన్స్ కి విపరీతమైన ఇష్టం ఉంటుంది.
ఇప్పటికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ గా ఉన్న హీరో ఎవరంటే అందరు వెంకటేష్ అనే చెప్తారు.
అయితే గత కొద్దీ రోజులుగా వెంకటేష్ సోలో గా సక్సెస్ కొట్టలేకపోతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో బాగా వినిపిస్తుంది.వెంకటేష్ తో పాటు ఉన్న హీరోలు అయినా చిరంజీవి బాలకృష్ణ 100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే వెంకటేష్ మాత్రం ఇంకా సోలో సక్సెస్ కోసం చాలా కష్టాలు పడుతున్నాడు అనే మాటలు సినీ అభిమానుల్లో వినిపిస్తున్నాయి దాంతో వెంకటేష్ కూడా రూట్ మార్చి, హిట్ సిరీస్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో సైందవ్ ( Saindav ) అనే టైటిల్ తో ఒక పవర్ఫుల్ సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా కి సంభందించిన గ్లింప్సెస్ కొద్ది రోజుల కిందట రిలీజ్ అయింది.ఇది చూస్తే పవర్ ఫుల్ రోల్ లో వెంకటేష్ కనిపించబోతున్నారు అని తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటె ఇప్పటికే ఈ స్టోరీ లీక్ అయింది అనే న్యూస్ నెట్ లో తెగ చెక్కర్లు కొడుతోంది.ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫిసర్ అయినా వెంకటేష్ తన డ్యూటీ లో భాగంగా కొంత మంది రౌడీలతో గొడవలు పెట్టుకుంటాడు.ఆ గొడవల్లో భాగంగా తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతాడు అలాగే తన జాబ్ కూడా కోల్పోతాడు అన్ని కోల్పోయిన వెంకటేష్ రౌడీల మీద రివెంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకొని తన ఫ్యామిలీ చావు కి కారణం అయినా ప్రతి రౌడీ నా కొడుకుని వెతికి మరి చంపుతాడు.ఇదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది… శైలేష్ కొలను డైరెక్షన్ చాలా బాగా ఉంటుంది.
అయితే తాను తీసిన రెండు సినిమాల్లో నటించిన హీరోలు చిన్న హీరోలు అవ్వడం వల్ల బాగా వాళ్ళని బాగా డీల్ చేసారు కానీ ఫస్ట్ టైం వెంకటేష్ లాంటి పెద్ద హీరో ని డీల్ చేస్తున్నాడు ఈ అటెంప్ట్ లో శైలేష్ కొలను కనక హిట్ కొడితే వరసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి…
.