సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఒక్కోసారి మనసును కదిలిస్తుంటాయి.అవును, కొన్ని కొన్ని వీడియోలు వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు.
ఆ భావాలను పలికించడానికి పదాలు కూడా రావు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో అలాంటిదే.
సహజంగా జంతు ప్రపంచంలో ఒక జంతువుకు మరో జంతువుకు జాతి వైరం అనేది ఉంటుంది.పిల్లికి, శునకానికి( cat, dog )… పాముకి, ముంగిసకి… అదే విధంగా పిల్లికి కోతికి కూడా అదే విధమైన జాతి వైరం అనేది ఉంటుంది.
పిల్లి, కోతి టామ్ అండ్ జెర్రీ లెక్క అన్నమాట.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఒక పిల్లి తనకు తెలియకుండా అనుకోకుండా ఓ పెద్ద నీటి తొట్టిలో పడిపోయింది. ఆ నీటి తొట్టిలో నీళ్లు లేవు కానీ కింద బురద పేరుకుపోయి ఉంది.ఆ పిల్లి పిల్లకి అందులోంచి ఎలా బయటికి రావాలో అర్థం కావడం లేదు.
చాలా ట్రై చేస్తోంది కానీ బయటపడలేని పరిస్థితి.దాంతో అది ఆ నీటి తొట్టిలోనే సహాయం కోసం అరుస్తూ ఎదురుచూస్తోంది.
దాని ఎదురుచూపులు ఫలించాయి.ఎట్టకేలకు దాన్ని కాపాడడం కోసం ఓ కోతి పిల్ల అందులో దిగింది.
జాతివైరాన్ని వీడి ఆ కోతి( monkey ) ఆ పిల్లిని కాపాడడానికి వెళ్ళింది.

ఇది విషయం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.దాంతో ఆ కోతిని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు.కాగా వీడియోలో కోతి పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు.
కానీ పాపం పిల్లిని కాపాడడం తన వాళ్ళ కావడంలేదు.ఆఖరికి ఎట్టకేలకు ఆ విషయాన్నీ గమనించిన ఒక అమ్మాయి.
ఆ కోతికి సహాయం చేసింది.ఆ నీటి తొట్టిలోకి దిగి బురదలో ఉన్న పిల్లిని బయటికి తీసింది.
దాంతో ఆ కోతి ముఖంలో ఆనందం తాండవం చేస్తోంది.ఆ చిన్న పిల్లిని కష్టంలోంచి గట్టెక్కించానన్న ఆనందం ఆ కోతి పిల్ల ముఖంలో స్పష్టంగా ఇక్కడ గమనించవచ్చు.







