అరుదైన గౌరవం అందుకున్న ప్రభాస్ ఆది పురుష్... సంతోషంలో చిత్ర బృందం!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఆది పురుష్( Adipurush ).ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా నటి కృతిసనన్ ( Kritisanan ) సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు.

 Prabhas Adi Purush Who Received A Rare Honor Happy Film Team ,tribeca Film Festi-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.ఈ క్రమంలోని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలయ్యాయి.

ఈ పోస్టర్లు చూసినటువంటి అభిమానులు తీవ్రస్థాయిలో చిత్ర బృందం పై విమర్శలు చేశారు.హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే రాముడి రూపురేఖలని మార్చేసారంటూ ఈ పోస్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇలా విడుదలకు ముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందోనని ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది.

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ( Tribeca Film Festival )లో ఆది పురుష్ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ( Om Rauth )సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.సంతోషానికి మించిన విషయం 2023 జూన్ 13వ తేదీ ఆది పురుష్ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది.

ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు ఆది పురుష్ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు.ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube