తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఫాంహౌస్ కట్టుకున్నారన్నారు.ఏకంగా నదినే కబ్జా చేసి నదిలో ప్రహరీ గోడ కట్టారని ఆరోపించారు.80 ఎకరాలు కొని 165 ఎకరాలకు కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఆర్డీఎక్స్ ప్రాజెక్ట్ భూములను నిరంజన్ రెడ్డి వదల్లేదని విమర్శించారు.







