అమెరికాలోని( America ) స్టాక్‌టన్, శాక్రమెంటో తదితర ప్రాంతాల్లో వున్న గురుద్వారాలలో ( Gurdwara ) వరుస కాల్పులకు సంబంధించి 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుంచి ఏకే 47, హ్యాండ్ గన్స్, మెషిన్ గన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో నలుగురు భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు కాగా , మిగిలిన వారు అమెరికన్ సిక్కులుగా గుర్తించారు.మార్చి 26న గురుద్వారా శాక్రమెంటో సిక్కు సొసైటీలో జరిగిన నగర్ కీర్తన్‌ను( Nagar Keerthan ) లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులు జరిపారు.
వేలాది మంది ప్రజలు గుమిగూడిన బ్రాడ్ షా రోడ్‌లోని వైన్‌యార్డ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాల్పుల ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్ధితి విషమంగానే వుంది.
దీనిపై అప్రమత్తమైన అధికారులు ఆపరేషన్ బ్రోకెన్ స్వార్డ్( Operation Broken Sword ) పేరుతో దర్యాప్తు ప్రారంభించారు.ఆయుధాల అమ్మకం, హింసాత్మక నేరాలతో ప్రమేయం వున్న రెండు క్రిమినల్ సిండికేట్లను టార్గెట్ చేశారు.
ఈ క్రమంలో ఆదివారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిల్వ వుంచిన వున్న 41 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, యుబా సిటీ పోలీస్ చీఫ్ చేసిన ప్రకటన ప్రకారం.ఆదివారం నార్త్ కాలిఫోర్నియాలోని 20 ప్రదేశాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 17 మందిని అరెస్ట్ చేశారు.
పట్టుబడిన వారిలో భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా వున్న ఇద్దరు మాఫియా సభ్యులు కూడా వున్నారు.షుటర్, శాక్రమెంటో, శాన్ జోక్విన్, సోలాన్, యోలో, మెర్‌సిడ్ తదితర కౌంటీలలో జరిగిన ఐదు హత్యాయత్నాలు సహా వివిధ హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు కూడా అరెస్ట్ అయిన వారిలో వున్నారు.
ఆగస్ట్ 27, 2022న స్టాక్‌టన్‌తో పాటు మార్చి 23, 2023న శాక్రమెంటో సిక్కు దేవాలయాల్లో జరిగిన కాల్పులకు కూడా ఈ గ్యాంగ్‌లే కారణమని పోలీసులు భావిస్తున్నారు.పరేడ్‌లో పాల్గొన్న ప్రత్యర్ధులపై కాల్పులు జరపడమే నిందితుల ఉద్ధేశం.
మింటా, ఏకే 47 గ్రూప్ అనే పిలవబడే ఈ రెండు క్రిమినల్ గ్యాంగ్‌లు గతంలో ఒకే గ్రూప్.

ఇదిలావుండగా.అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.
జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.
ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా మరణిస్తున్నారు.సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.
గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.
ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.







