తెలంగాణ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టాలని బిఆర్‌ఎస్( Brs ) ఉవ్విళ్లూరుతుంది.అందుకు తగ్గట్టుగానే కేసిఆర్( KCR ) కూడా పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులను పర్యవేక్షిస్తూ పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు.ఎన్నికలకు కేవలం ఆరునెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రతిక్షణం కూడా ప్రజల్లో ఉండాలని నేతలకు సూచిస్తున్నారు కేసిఆర్.
గత గత ఎన్నికల సమయంలో చూపించిన కాన్ఫిడెంట్ ఈ సారి ఆయనలో కనబడడం లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

దీనికి కారణం కూడా లేకపోలేదు.కేసిఆర్ ది కుటుంబ పాలన అని ఆయన అమలు చేస్తున్న ప్రతిపథకం రాజకీయ లబ్ది కోసమే అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.అదే సమయంలో దళితబంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి( Dalitbandhu, Rythu Bhima, Kalyana Lakshmi ) వంటి పథకాలు అర్హులైన వారికి కూడా అందడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేసిఆర్ పాలనపై ఈసారి పెదవి విరుస్తున్న తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బిజెపి బలపడుతున్న తీరు చేస్తుంటే బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు బీజేపీని చూస్తున్నారనే విషయం అర్థమౌతుంది.
దాంతో ఈసారి బిఆర్‌ఎస్ విజయం సాధించడం గతంలో మాదిరి అంతా ఈజీ కాదనేది కొందరు చెబుతున్నా మాట.

అందుకే ఈసారి కూడా విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో వ్యూహాలు రచించడం ఎంతో ముఖ్యం.అందులో భాగంగానే గ్రామాలపై కేసిఆర్ ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.గెలుపు ఓటములను డిసైడ్ చేయడంలో గ్రామీణ ఓటర్ల ప్రభావం అధికంగా ఉంటుంది.
అందుకే గ్రామీణ ఓటర్ల( rural voters ) దృష్టి మరలకుండా ఉండేందుకే కేసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే గ్రామాలకు సకాలంలో నిధులు విడుదల చేయడంలో

కేసిఆర్ సర్కార్ వెనుకడుగు వేస్తోందని గ్రామీణ సర్పంచులు కొంత అసహనంగా ఉన్నారు.దీంతో వీరంతా బిఆర్‌ఎస్ కు యాంటీగా మారితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.ఎందుకంటే గ్రామీణ ఓటర్లను సర్పంచులు గట్టిగానే ప్రభావితం చేయగల సత్తా ఉంది.
అందుకే సర్పంచుల అసంతృప్తిని తొలగించే పనిలో ఉన్నారట కేసిఆర్.మరి సర్పంచులను గ్రామీణ ఓటర్లను ఆకర్చించేందుకు కేసిఆర్ ముందు రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.







