అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఏజెంట్( Agent ) సినిమా దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
అఖిల్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో నైజాం ఏరియాలలో థియేటర్ల రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.

ఏజెంట్ సినిమా విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.నైజాంలో ఈ సినిమాకు సరైన థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది.ఏప్రిల్ 28వ తేదీన పీఎస్2( Ponniyin Selvan 2 ) సినిమా కూడా థియేటర్లలో విడుదలవుతోంది.పీఎస్2 సినిమాకు నైజాంలోని మెయిన్ థియేటర్లను కేటాయిస్తున్నారని బోగట్టా.ఈ సినిమా వెనుక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఉన్నారని ఆయనే ఏజెంట్ సినిమాను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలుస్తోంది.ఏజెంట్ సినిమాలో గన్ కల్చర్ కు సంబంధించిన ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.

నైజాం థియేటర్ల రాజకీయాలకు అఖిల్ బలవుతున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.మరికొన్ని గంటల్లో ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈ ట్రైలర్ వల్ల సినిమాపై అంచనాలు పెరుగుతాయని చెప్పవచ్చు.ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/04/Agent-akhil-Sakshi-Vaidya-Ponniyin-Selvan-2-Nagarjuna.jpg”/>
సాక్షి వైద్య రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొత్త హీరోయిన్లతో కలిసి నటించడానికి అఖిల్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు.అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాకు థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాగ్( Nagarjuna ) జోక్యం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.







