ఇటీవలే కాలంలో కుటుంబ సభ్యులు, బంధువుల కంటే బయట వ్యక్తులు ఎంతో మేలు.ఎందుకంటే బయట వ్యక్తులు కేవలం మోసం చేసి వదిలేస్తారు అంతే.
కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం అలా కాదు, ఏకంగా హత్య చేసి కాటికి పంపించేస్తారు.ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇటువంటి దారుణాలే బయటపడుతున్నాయి.
ఇలాంటి ఒక సంఘటన శంషాబాద్ లో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకెళితే.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు గత రెండేళ్లుగా హైదరాబాదులోని మధురానగర్( Maduranagar ) లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు.ఈనెల ఏప్రిల్ 11న వీరి కుమార్తె (16) అదృశ్యమై, మూడు రోజుల అనంతరం ఏప్రిల్ 14 న రాళ్ల గూడ రహదారి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లో శవమై కనిపించింది.
పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేయగా అదృశ్యమైన యువతిగా గుర్తించి తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆ బాలిక తమ కూతురే అని తల్లిదండ్రులు నిర్ధారించారు.

పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉండే సీసీ టీవీ పుట్టేజీ తో పాటు స్థానికుల సమాచారం ప్రకారం బాలిక తల్లి సోదరుడు జట్పోలు విష్ణు( Jatpolu Vishnu ) (23) పై అనుమానంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించారు.దీంతో అసలు నిజం అంగీకరించాడు.విష్ణు తన మేనకోడలితో చాలా సన్నిహితంగా ఉండేవాడు.
అయితే మేనకోడలు ఇతరులతో చనువుగా ఉండడం నచ్చకపోవడంతో ఆమెపై కోపం పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు ఈనెల 11వ తేదీ సాయంత్రం బాలికను తీసుకొని రాళ్లగూడ రహదారి పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తరువాత బండరాళ్లతో కొట్టి చంపి అక్కడనుండి పారిపోయాడు.కేసు చేధించిన శంషాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సుమన్, తరుణ్ లను డిసిపి భాస్కర్ అభినందించారు.







