వెండితెర చందమామగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఇండస్ట్రీకి కాస్త విరామం తీసుకుని తిరిగి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.2020 వ సంవత్సరంలో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు(Gaurham Kitchlu) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.ఇక అదే సమయంలోనే కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో పూర్తిగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

ఇలా కాజల్ అగర్వాల్ గత ఏడాది ఏప్రిల్ 19వ తేదీ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలియజేశారు.ఇక తన కుమారుడికి నీల్ కిచ్లు(Neil Kitchlu) అని నామకరణం చేశారు.బాబు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు బాబు బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమైన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె ఇండియన్ 2 (Indian 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
అదే విధంగా బాలకృష్ణ(Balakrishna) అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక తన కుమారుడు గురించి కూడా ఈమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే మరొక రోజులో కాజల్ కుమారుడు నీల్ మొదటి పుట్టినరోజు (First Birthday)రానున్న నేపథ్యంలో ఈమె ఫోటోషూట్ చేయించారు.
ఈ క్రమంలోనే అందుకు సంబంధించినటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోలో కాజల్ తన బాబు ఫేస్ కనపడకుండా కవర్ చేసారు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారడమే కాకుండా నేటిజన్స్ బాబు ఫేస్ రివిల్ చేయండి అంటూ కామెంట్లు చేస్తూ తన కుమారుడికి అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







