ఇటీవల కాలంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా జిమ్( Gym ) లో తెగ కష్టపడుతూ బరువులు ఎత్తుతూ చెమటలు చిందిస్తున్నారు.ఫిట్ గా ఉండడం కోసం హీరోయిన్లు కూడా బాగానే శ్రమిస్తున్నారు.
కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా సామాన్య వ్యక్తులు కూడా ఫిట్నెస్ విషయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హీరోయిన్లు కూడా జిమ్ లో కష్టపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆ ఫోటోలో హీరోయిన్ జిమ్ లో తెగ కష్టపడుతోంది.కేవలం రెండు చేతులపై శరీర బరువు మొత్తం మోస్తూ గాలిలో తేలుతూ చెమటలు చిందిస్తోంది.కాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
మొన్నటి మొన్న బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడిని ఏకంగా 99 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఈ బ్యూటీ మరెవరో కాదు రాశీఖన్నా( Rashi Khanna ).

తరచూ సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్ర కారుకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది అని చెప్పవచ్చు.ఆ ఫోటోలో కూడా ఫిట్ గా ఉండే బట్టలు ధరించడంతోపాటు అందాల ఆరబోతలు చేస్తోంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే తెలుగులో రాశీఖన్నా చివరగా థాంక్యూ సినిమా( Thank you movie )లో నటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగులో శివమ్, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, బెంగాల్ టైగర్, శ్రీనివాస కళ్యాణం సుప్రీమ్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.







