ఈ విశాల ప్రపంచాన్ని చుట్టిరావాలని ఎవరికుండదు? ప్రపంచ దేశాలు తిరుగుతూ, భిన్న సంస్కృతులను స్పృశిస్తూ, కొత్త మనుషులను నిత్యం పరిచయం చేసుకుంటుంటే అందులో వున్న కిక్కే వేరు.ఒకప్పుడు ట్రావెలింగ్( traveling ) అనేది కష్టంతో కూడుకున్న పని.
కానీ మనదగ్గర డబ్బు ఉండాలేగాని నేడు ప్రపంచాన్ని సైతం చుట్టేయటాన్ని సులభతరం చేసే అత్యాధునిక వాహనాలు ఎన్నో మనకి అందుబాటులోకి వచ్చాయి.వాటిలో క్రూయిజ్ షిప్( cruise ship ) ఒకటి.
క్రూయిజ్ షిప్పులలో ప్రయాణించేవారు హోటల్స్ బుక్ చేసుకోనక్కర్లేదు.షిప్‌లోనే అన్ని వెసులుబాట్లు దొరుకుతాయి.
అందుకే ట్రావెలర్స్ ఈమధ్యకాలంలో వీటి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రూయిజ్ షిప్ కంపెనీ ట్రావెలర్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది.విషయం ఏమంటే, ఏకంగా మూడు సంవత్సరాలు పాటు ట్రావెలర్స్‌ని ప్రపంచమంతా తిప్పి చూపిస్తామని తెలిపింది.ప్రముఖ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ లైఫ్ ఎట్ సీ క్రూయిసెస్ 3 సంవత్సరాల ట్రావెల్ ప్యాకేజీ ( Travel package )గురించిన వివరాలను తాజాగా ప్రకటించింది.
ప్రయాణికులు మూడేళ్ల ట్రావెల్ ప్యాకేజీలో MV జెమినీ ( MV Gemini in a three-year travel package )అని పిలిచే అతిపెద్ద క్రూజ్ షిప్‌లో 7 ఖండాలలోని దాదాపుగా 135 దేశాలను చుట్టిరావొచ్చు.

ఈ MV జెమినీ ఒకేసారి 1,074 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు.ఇందులో వారు ఉండటానికి 400 ప్రత్యేక గదులు ఉంటాయి.ఈ సంవత్సరం నవంబర్ 1న ఈ షిప్ ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి బార్సిలోనా, మయామికి ప్రయాణిస్తుంది.
భారతదేశంలోని తాజ్ మహల్, రియో డి జనీరోలోని క్రైస్ట్ ది రిడీమర్ స్టాచ్యూ, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో సహా ప్రపంచంలోని 14 చూడదగ్గ ప్రదేశాలలో 13 ప్రదేశాల వద్ద ఈ షిప్ ఆగుతుంది.ఈ నేపథ్యంలో లైఫ్ ఎట్ సీ క్రూయిసెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ.
రొటీన్ లైఫ్‌తో విసిగిపోయిన వ్యక్తులను ప్రపంచ వ్యాప్తంగా చేసే మూడు సంవత్సరాల ప్రయాణంలో తమతో చేరమని ఆహ్వానించడం కొసమెరుపు.







