తమిళం లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే ( Love today )చిత్రాన్ని తెలుగు లో అదే టైటిల్ తో విడుదల చేసిన విషయం తెలిసిందే.దిల్ రాజు( Dil Raju ) ఆ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
కానీ ప్రేక్షకులు ఆ సినిమా ను లైట్ తీసుకున్నారు.అంతే కాకుండా దిల్ రాజు కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.
దాంతో సూపర్ హిట్ అవుతుంది అనుకున్న లవ్ టుడే ఫెయిల్ అయింది.సినిమా ను చిత్ర యూనిట్ సభ్యులు సరిగా ప్రమోట్ చేయక పోవడం వల్ల కిల్ చేశారు అంటూ కొందరు అభిప్రాయం అర్థం చేస్తున్నారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే దిల్ రాజు స్వయంగా లవ్ టు డే విషయంలో తప్పు జరిగిందని పేర్కొన్నాడు.ఇప్పుడు మరో తమిళ సినిమా ని తెలుగు మేకర్స్ మరియు ప్రేక్షకులు కిల్ చేశారు.ఇటీవలే తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదలై ( Viduthalai )అనే చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి హీరోగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విడుదలై చిత్రం తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ విడుదల అయిన వారం రోజుల్లోనే తెలుగు లో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.తెలుగు లో కూడా అదే టైటిల్ ‘విడుదల’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పోలీస్ స్టోరీ డిజాస్టర్ కలెక్షన్స్ ని నమోదు చేసింది.
తమిళ సినిమా అవ్వడంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఆమడ దూరంలో సినిమా ఉంది.

కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడం తో తెలుగు ప్రేక్షకులు విడుదల సినిమా ను పక్కన పెట్టేశారు.విడుదలకు పోటీగా రిలీజ్ అయిన ఇతర సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.అయినా కూడా విడుదల సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో రాబట్టిన కలెక్షన్స్ తో పోలిస్తే తెలుగులో రాబట్టిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకోక పోవడమే మంచిది అన్నట్లుగా కలెక్షన్స్ ఉన్నాయి.







