ఆదిపురుష్‌ కంటే హనుమాన్ పైనే ఎక్కువ ఆసక్తి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా బాలీవుడ్ లో రూపొందిన ఆదిపురుష్‌( Adipurush ) చిత్రం తో పోలిస్తే తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ చిత్రం పై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది.ఓవరాల్ గా దేశం మొత్తం చూసుకుంటే ఆదిపురుష్‌ చిత్రం మంచి హైప్ తో విడుదల కాబోతుంది.

 Prabhas Adipurush And Teja Sajja Hanuman Movies Releasing Soon , Adipurush, Teja-TeluguStop.com

కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prashant Verma ) పై నమ్మకం మరియు తేజా సజ్జా పై ఉన్న అభిమానం కారణంగా ఆదిపురుష్‌ కంటే కూడా ఎక్కువగా హనుమాన్ చిత్రాన్ని నమ్ముతూ ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.హనుమాన్ కథ ను ఈ తరం పాత్రలకు జోడిస్తూ రూపొందించిన చిత్రమే హనుమాన్.

దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉన్నాడు.కనుక ఈ సినిమా తో కూడా అతడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇదే సమయంలో ఆదిపురుష్‌ సినిమా పై పెద్దగా ప్రేక్షకుల్లో నమ్మకం కనిపించడం లేదు.ఆ మధ్య టీజర్ విడుదల తర్వాత ఆదిపురుష్‌ ను జనాలు నమ్మడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయమై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.కనుక సినిమా మినిమం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా ఈజీగా 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది.ఇక తేజా సజ్జా, ప్రశాంత్ వర్మల హనుమాన్ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా రూ.100 నుండి రూ.200 కోట్ల కలెక్షన్స్ మాత్రమే నమోదు అవుతాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube