సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వం లో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ పుష్కర కాలంగా వీరి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కు సంబంధించి అనేక రకాల పూకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.అతడు మరియు ఖలేజా( Khaleja ) చిత్రాలతో ఈ జోడి అప్పట్లో కమర్షియల్ గా డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెల్సిందే.
అయితే ప్రస్తుతం ఆ సినిమా లకు మంచి క్రేజ్ ఉంది.ఇన్నాళ్ల తర్వాత రాబోతున్న ఈ చిత్రం తో భారీ కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశం తో ఇద్దరూ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చాలా ఆలస్యం అయ్యాయి.అన్ని అన్నట్లుగా జరిగితే ఈనెల 24వ తారీఖున ఈ సినిమా రావాల్సి ఉంది.కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ సంవత్సరంలోనే సినిమా రాలేక పోతోంది.వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ నెల 21వ తారీకు నుండి ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ప్రారంభించి కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది.విదేశీ పర్యటన నుండి వచ్చిన మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
చకచక ఈ సినిమా ను పూర్తి చేసుకుంటే రాజమౌళి కి డేట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని మహేష్ బాబు భావిస్తున్నాడు.అందుకే స్పీడ్ గా సినిమా ను చేయాలంటూ త్రివిక్రమ్ కు సూచించినట్లు తెలుస్తుంది.







