ప్రస్తుతం దృష్టి మొత్తం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఉందని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికలు అయిన తరువాత ఎక్కువ సమయం తెలంగాణకు కేటాయిస్తానని తాజాగా టీ కాంగ్రెస్ నేతలతో చర్చించడం జరిగింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో( Shamshabad Airport ) కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు.

ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై… రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది.ఈ చర్చలలో BRS పార్టీతో పొత్తు ఉండదని టీ కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేయడం జరిగింది.పొత్తు ఉందని ప్రచారం చేస్తూ.
బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని… ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని.తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించారు.

ఇదే సమయంలో కులగణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) ముగిసిన అనంతరం మే 15 తర్వాత తెలంగాణకు వస్తానని పేర్కొన్నారు.అప్పటినుండి ఎక్కువ సమయం.తెలంగాణకు కేటాయించడం జరుగుతుందని రాహుల్ స్పష్టం చేశారు.







