మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్వహించిన భూషణ్ అవార్డు ప్రధానోత్సవంలో అపశ్రుతి నెలకొంది.వడదెబ్బ తగిలి సుమారు పదకొండు మంది మృతిచెందగా.
పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిని నవీ ముంబై సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరణాలు సంభవించాలయని సీఎంవో కార్యాలయం తెలిపింది.
అయితే మధ్యాహ్నం సమయంలో తీవ్ర మండుటెండలో కార్యక్రమం నిర్వహించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







