గుంటూరు జిల్లా పొన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పేదల పెన్షన్లను తొలగించారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టిడించేందుకు బాధితులు ప్రయత్నించారు.
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో కార్యాలయ ముట్టడికి యత్నించారు.రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, బాధితులకు మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ఈ నేపథ్యంలోనే పోలీసులు తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు ఆరోపించారు.
అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల, బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.







