వైరల్: సింహానికే చుక్కలు చూపించిన తాబేలు!

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి ఈ వీడియోలో కనిపిస్తున్న సింహాన్ని చూస్తే అర్ధం అవుతుంది.అడవికి రాజైతే నాకేంటి? అన్నట్టు వ్యవహరిస్తున్న తాబేలు తీరుని చూసి నెటిజన్లు అయితే అవాక్కవుతున్నారు.సోషల్ మీడియాలో సింహాల వీడియోలు మనకు చాలానే కనిపిస్తుంటాయి.సింహాలు( lions ) ఇతర జంతువులను వేటాడడం, ఇతర జంతువులు సింహాలను భయపెట్టే వీడియోలు అనేకం మనకు కనిపిస్తూ ఉంటాయి.

 Viral The Turtle Showed The Dots To The Lion , Lion, Tortoise, Viral Video, Vira-TeluguStop.com

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నెక్స్ట్ లెవల్ వీడియో అని చెప్పుకోవచ్చు.

నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వెళ్లిన సింహాన్ని చూస్తే అడవి రాజు అన్న మాటలు ఉట్టి మాటలే అని అనిపించక మానదు.అవును, సింహం ఒక చిన్న ప్రాణి ముందు ఓడిపోయిన ఘటనని ఇక్కడ చూడవచ్చు.మృగరాజును ఒక చిన్ని తాబేలు( tortoise ) ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందనే చెప్పుకోవాలి.

సింహానికి బాగా దాహం వేయడంతో ఒక కొలను దగ్గరికి వెళ్లి అందులోని నీళ్లను తాగడం మొదలు పెట్టింది.అదే సమయంలో అక్కడికి చేరుకున్న బుల్లి తాబేలు సింహాన్ని నీళ్లు తాగనివ్వకుండా ఇబ్బంది పెట్టింది.

అలా సింహం నీళ్లు తాగేందుకు నదిలోకి వంగిన ప్రతిసారి తాబేలు దాన్ని వేధించసాగింది.అయితే ఈ క్రమంలో సింహం వెనక్కి తగ్గింది కానీ, తాబేలుకు ఎటువంటి హాని కలిగించలేదు.కనీసం దాన్ని బెదిరించి తరిమికొట్టడానికి ప్రయత్నించకపోవడం కొసమెరుపు.ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘లేటెస్ట్ కర్జర్’ అనే అకౌంట్ ద్వారా షేర్‌ చేయగా, వీడియో వైరల్‌గా మారింది.

తాబేలు తన చెరువు నుంచి సింహాన్ని తరిమికొట్టిందనే ఫన్నీ క్యాప్షన్‌తో సదరు వీడియో పోస్ట్ కావడం విశేషం.కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube