మెగా డాటర్ నిహారిక( Niharika ) గురించి పరిచయం అవసరం లేదు నాగబాబు( Naga Bab u) కుమార్తెగా మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఈమె ఎంట్రీ ఇచ్చారు.బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనని మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేకపోయారు.
ఇలా ఈమె హీరోయిన్ గా మూడు సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈమె నటనకు గుడ్ బై చెబుతూ నిర్మాతగా మారారు.ఇకపోతే ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్స్ స్థాపించిన నిహారిక ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్లో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేశారు.ఇలా వృత్తిపరంగా నిహారిక దూకుడు కనబరుస్తున్నారని ఇక తాజాగా ఈమె పలువురు యంగ్ మేకర్స్, రైటర్ తో కలిసి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.తన నిర్మాణ సంస్థ ద్వారా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మించే దిశగా నిహారిక అడుగులు వేస్తూ తన కెరియర్ పై దృష్టి పెట్టారు.

ఇకపోతే గత కొంతకాలంగా నిహారిక విడాకులు( Divorce ) గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈమె గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నారని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే నిహారిక వెంకటచైతన్య ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.అయితే ఒకవైపు విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మెగా కుటుంబం గానీ నిహారిక గాని ఈ విషయం గురించి ఏమాత్రం స్పందించలేదు కానీ నిహారిక మాత్రం తన కెరియర్ పై దృష్టి పెడుతూ పలువురు దర్శక నిర్మాతలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ బిజీగా ఉన్నారు.







