ఇంట్లో శవం ఉన్నా బయటికెళ్లి నాటకం వేయాల్సిందే.. బలగం నటి కామెంట్స్ వైరల్!

2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో బలగం సినిమా ( Balagam )ఒకటి కాగా ఈ సినిమాలో నటించిన నటీనటులలో చాలామంది ప్రేక్షకులకు పరిచయం లేని వాళ్లే అనే సంగతి తెలిసిందే.3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు( Dil Raju )కు మంచి లాభాలను అందించింది.రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

 Balagam Fame Vijayalakshmi Comments About Surabhi Artists Real Life Situations ,-TeluguStop.com

బలగం సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో విజయలక్ష్మి( Vijayalakshmi ) ఒకరు కాగా ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సురభి ( Surabhi )వాళ్లలో ఆడవాళ్లు, మగవాళ్లకు తేడా ఉండదని ఆడవాళ్లు సైతం మగవాళ్ల వేషాలను అద్భుతంగా వేయగలరని ఆమె చెప్పారు.

బలగం సినిమాలో నటీనటులను ఎంపిక చేయడం కోసం దర్శకుడు వేణు ( Director Venu )చాలా కష్టపడ్డారని విజయలక్ష్మి కామెంట్లు చేశారు.

మేము కళాకారులం అయినప్పటికీ ఇప్పటివరకు బయటకు తెలియని కళాకారులమని బలగం సినిమాతో ఇప్పుడు మేము ప్రపంచానికి తెలిసిన కళాకారులం అయ్యామని ఆమె తెలిపారు.మాది 130 సంవత్సరాలు ఉన్న సురభి సంస్థ అని నేను మూడో తరగతిలోనే నాటకాలు వేయడం మొదలుపెట్టానని విజయలక్ష్మి పేర్కొన్నారు.నాటకాలు వేయడం అంటే ఇద్దరు వచ్చినా పది మంది వచ్చినా ఆడాల్సిందేనని ఒక మనిషి చనిపోయినా శవాన్ని ఇంటి లోపల పెట్టి స్టేజ్ మీద ఆడాల్సిందేనని మేము కళామతల్లిని అంతలా నమ్ముకున్నామని ఆమె తెలిపారు.

మా పిల్లలు అలా ఇబ్బందులు పడకూడదని ఒక ప్రాంతంలో స్థిరపడి వాళ్లను చదివించామని విజయలక్ష్మి పేర్కొన్నారు.ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆమె చెప్పుకొచ్చారు.అప్పట్లో ధరలు తక్కువ అని 2 రూపాయలకు కిలో బియ్యం వచ్చేదని విజయలక్ష్మి తెలిపారు.విజయలక్ష్మి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube