వైరల్: పియానో సౌండ్‌కి పక్షి ఎలా పాడుతోందో చూడండి... నెటిజన్లు షాక్!

ఈ ప్రకృతిలో మాట్లాడే పక్షులు అనేకం ఉన్నాయి.అందులో మొదటగా మనం చిలుక( parrot ) గురించి మాట్లాడుకుంటాము.

 Viral Watch How A Bird Sings To The Sound Of A Piano Netizens Are Shocked-TeluguStop.com

ఈ మధ్య కాలంలో చిలుక జాతికి చెందిన వివిధ రకాల పక్షులు మాట్లాడడం సోషల్ మీడియాలో మనం చూస్తూనే వున్నాం.అయితే ఇక్కడ పక్షులు పాడడం గురించి చర్చ.

అవును, మనందరికీ తెలిసిందే.కోకిల పాటంటే అందరికీ ఇష్టమే.

నిజానికి అది కోకిల అరుపు.కానీ అది కమ్మగా ఉండడం వలన పాటగా మనం ఫీల్ అవుతాము.అయితే నిజంగా పాటపాడే పక్షిని మీరు చూసుండరు.

ఇపుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పక్షిని చూశారంటే ఆశ్చర్యపోక తప్పదు.

అది కూడా సరిగ్గా మన చేతిలో ఇమిడిపోయేటంత పక్షి అది.అయినా దాని స్వరం చాలా స్పష్టంగా విన్పిస్తుంది మనకు.ఇక్కడ వీడియోలో ఒక వ్యక్తి పియానో( piano ) ​​వాయిస్తుండగా ఆ పక్షి తాళానికి తగ్గట్టు పాడడం ఇపుడు చూపరులను కట్టిపడేస్తుంది.చూస్తుంటే, ఆ పక్షి అతని పెంపుడు జంతువుగా తెలుస్తోంది.

వీడియోలో, ఆ వ్యక్తి తన పియానోపై ట్యూన్ వాయిస్తూ కనిపించాడు.అతని పియానో ​​పక్కన ఉన్న స్టాండ్‌పై కూర్చున్న పక్షి తన సంగీతంతో సింఫనీలో పాడుతుంది.

కాగా ఆ రాగం శ్రవణానందంగా ఉండడం విశేషం.కావాలంటే వీడియో ఒక్కసారి చూడండి.ఇది ఖచ్చితంగా మీ మనసును గెలుచుకుంటుంది.అయితే ఈ వీడియోలోని పక్షి ఓ చిలుక జాతిగా కనిపిస్తుంది.కాగా ఇంటర్నెట్‌లో ఈ పక్షి అద్భుతమైన గాత్రం అందరినీ ఆకట్టుకుంది.అందమైన, మధురమైన పదాలతో ఉన్న ఆ పాట విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ క్రమంలో అనేకమంది నెటిజన్లు పియానో వాయిస్తున్న వ్యక్తితో సమానంగా పక్షి పాడుతున్న పాట భలేగా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

చిలుకని తప్పకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి పంపమని కొందరు సలహాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube