బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రణబీర్ కపూర్(Ranbir Kapoor) అలియా భట్ (Alia bhatt)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఒకటైన విషయం తెలిసిందే.
ఇలా పెళ్లయిన వెంటనే అలియా భట్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించారు.ఇక ఈ దంపతులు నవంబర్ నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
తనకు రాహ(Rahaa) అనే నామకరణం కూడా చేశారు.

ఇక ఏప్రిల్ 14వ తేదీ తమ మొదటి వివాహ వార్షికోత్సవం కావడంతో రణబీర్ కపూర్ అలియా భట్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి తనని సంతోషపరిచారు.ఇంతకీ రణబీర్ కపూర్ అలియాకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారనే విషయాన్ని వస్తే.మొదటి పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు పది లక్షల విలువ చేసే హ్యాండ్ బ్యాగ్(Hand Bag) ఇచ్చారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ దంపతులు ముంబైలో ప్రస్తుతం భాంద్రలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.

ఇలా తమ అభిరుచులకు అనుగుణంగా ఓ ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించడం కోసం ఈ జంట రావడంతో కెమెరా కంటికి చిక్కారు.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అలియా సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన రణబీర్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈయన ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటించారు వీరిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ప్రారంభం కానుంది.
వీరిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ప్రారంభం కానుంది.







